
అ‘పూర్వ’ సమ్మేళనం
ఆసిఫాబాద్‌అర్బన్/భైంసారూరల్/కాగజ్‌నగర్‌టౌన్: ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలోని పాఠశాల ల విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆసిఫాబాద్‌లోని శ్రీ వాసవి ఉన్నత పాఠశాలలో 1996–2004 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం రోజ్‌గా ర్డెన్‌లో, కాగజ్‌నగర్‌లోని సంతోష్ ఫంక్షన్ హాల్‌లో బాలభారతి ఉన్నత పాఠశాల 2002–03 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు, భైంసా మండలంలోని దేగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2001–02 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు చదువుల తల్లి ఒడిలో క లుసుకున్నారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలు సుకున్నారు. చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సుబ్బా మ హేశ్, ఇందారపు బాలకిషన్, ప్రసాద్, సతీశ్, తిరుమల్‌రావ్, చిత్రాని, చందన, శ్రీనివాస్, బెలే ప్రకాశ్, వామన్‌రావు, విఠల్ పాల్గొన్నారు.

అ‘పూర్వ’ సమ్మేళనం

అ‘పూర్వ’ సమ్మేళనం