
గల్లంతైన వ్యక్తి కోసం సెర్చ్ ఆపరేషన్
కడెం: కడెం వరదలో గల్లంతైన కన్నాపూర్‌కు చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ జాడ కోసం పాండ్వపూర్ వంతెన వద్ద ఎస్పీ జానకీ షర్మిల ఆదివారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, మత్స్యకారులు, డ్రోన్ కెమెరాతో గాలింపు చర్యలు చేపట్టారు. కడెం, దస్తురాబాద్ మండలాల్లోని కడెం నది వెంట గాలించారు. రాత్రి వరకు జన్నారం మండలం కలమడుగు వరకు చేరారు. కడెం, గోదావరి వెంట జల్లెడ పట్టిన ఆచూకీ లభించలేదు. ఒక వైపు కడెం ప్రాజెక్ట్‌పై నుంచి దిగువ, కన్నాపూర్ చెరువు మార్గం, గ్రామ శివారు గల చేన్ల నుంచి వెళ్లేమార్గాల్లో బారికేడ్లు పెట్టి మూసివేశారు. సీఐ అజయ్, ఎస్సై సాయికిరణ్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గంగాధర్ తిరిగిరావాలని కుటుంబ సభ్యులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
కడెం ప్రాజెక్ట్ సందర్శన..
కడెం ప్రాజెక్ట్‌ను ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ సందర్శించారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో, 18 వరద గేట్ల పని తీరును తెలుసుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేశ్‌యాదవ్, నాయకులు భూమేశ్, తదితరులు ఉన్నారు. కాగా, వరదల కారణంగా మూడు రోజులుగా బోటింగ్ నిలిచిపోయింది. ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల భద్రత దృష్ట్యా పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు.

గల్లంతైన వ్యక్తి కోసం సెర్చ్ ఆపరేషన్