
కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం
పాతమంచిర్యాల: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘాలు వి ఫలమయ్యాయని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్మికుల సమస్యలను గత టీబీజీకేఎస్ విస్మరించిందన్నారు. ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ లు సర్కార్‌కు తొత్తులుగా మారాయన్నారు. సింగరేణి ఉద్యోగులకు సొంతింటికి 2 గుంటల భూమి ఇవ్వాలని, మారుపేర్ల సమ స్య పరిష్కరించాలని, ఓపెన్ కాస్టులు రద్దు, నూతన భూగర్భగనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నూతన గనులు ఏర్పాటు కోసం ప్రజా, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో ఉద్య మం చేపడుతామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు దాసరి జనార్దన్, జిల్లా అధ్యక్షుడు జైపాల్‌సింగ్, బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి సమ్ము రాజన్న పాల్గొన్నారు.
నీల్వాయి ఎస్సై సస్పెన్షన్
వేమనపల్లి: ఎట్టకేలకు నీల్వాయి ఎస్సై ఇ.సురేష్‌ను సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ క మిషనరేట్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నెల 11న మండలంలోని సుంపుటం గ్రా మానికి చెందిన భార్యభర్తల గొడవలో భర్త కిష్టయ్యను స్టేషన్‌కు పిలిపించి చితకబాదాడు. కౌ న్సెలింగ్ పేరుతో రూ.10 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడు పోలీ స్ కమిషనరేట్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. సమగ్ర విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు.