
పర్వతారోహణకు మంచు అడ్డు
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని కెలికే గ్రామానికి చెందిన గిత్తె కార్తీక్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మౌంట్ యూనామ్ పర్వతారోహణకు మంచు అడ్డు తగిలింది. ఫలితంగా ఆయన ఆశయం నీరు గారింది. కార్తీక్ ఈనెల 9న మనాలి నుంచి మౌంట యూనామ్ పర్వతారోహణకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 10వ తేదీ నుంచి 12 వరకు 3,650 మీటర్ల ఎత్తులో ఉన్న స్పిటిక్వాలిలోని కాజాకు చేరుకున్నారు. దీన్ని కానామో పర్వతమని పిలుస్తారు. 13న కాజా నుంచి కిబ్బర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడే ఫైనల్ ట్రెక్ చేశారు. 14న కానామో బేస్ క్యాంప్ నుంచి వారి ప్రయాణం ప్రారంభమైంది. కొంతదూరం వెళ్లాక సేదతీరారు. 15న శిఖరానికి చేరుకుని త్రివర్ణ పతాకం అధిరోహించాలని 14న అర్ధరాత్రి ఆయన ప్రయాణం ప్రారంభించాలని అనుకున్నాడు. 15 ఉదయం వరకు 7 గంటల వరకు మంచుపాతం మొదలైంది. వాతావరణం అనుకూలించక యూనామ్ పర్వతాన్ని అధిరోహించలేక నిరాశతో వెనుతిరిగాడు. మరో వంద కి.మీ ఎత్తుకు వెళ్లగలిగితే అధిరోహించేవాడు. మొత్తం 5,900 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి నిరాశతో వెనుదిరిగి వచ్చాడు. కార్తీక్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆనంద్‌బాబు, నక్ష్ ఉన్నారు.