వర్షానికి కూలిన ఇల్లు | - | Sakshi
Sakshi News home page

వర్షానికి కూలిన ఇల్లు

Aug 18 2025 5:39 AM | Updated on Aug 18 2025 5:39 AM

వర్షా

వర్షానికి కూలిన ఇల్లు

కుంటాల: మండలంలోని ఆయా గ్రామాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లింబా(బి) గ్రామంలోని దృపతి బాయి నివసిస్తున్న ఇల్లు కూలింది. ఆ ఇంటిని అధికారులు ఆదివారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని తహసీల్దార్‌ కమల్‌సింగ్‌ సూచించారు. ఆయన వెంట ఆర్‌ఐ అడెల్లు, పంచాయతీ కార్యదర్శి గంగాప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

రెబ్బెనలో..

భీమిని: కన్నెపల్లి మండలంలోని రెబ్బెనలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గోమాస రాజేందర్‌ చెందిన ఇల్లు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రామాంజనేయులు ఆదివారం ఆ ఇంటిని పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

వర్షానికి కూలిన ఇల్లు1
1/1

వర్షానికి కూలిన ఇల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement