
మానసికంగా తీరనిలోటు
జీవితానికి ఆత్మీయత అనుబంధాలకు ఉత్తరం లేఖ అనేది ఒక గవాక్షం లాంటిది. సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఉత్తరానిదే. ఉత్తరం అంటే నాలుగు వాక్యాలు రెండు మడతలు కానే కాదు..ఆ ఉత్తరం కనుమరుగవ్వడం మానసికంగా తీరని లోటు.. లేఖ సాహిత్యం అనేది ఒక ఆత్మీయ ప్రపంచం అది అంతర్థానమవడం బాధాకరం.
– టి.సంపత్ కుమార్,
నవలా రచయిత, నిర్మల్
గుర్తించలేకపోతున్నారు
ఉపాధ్యాయుడిగా ఉద్యోగావకాశం వచ్చిందని నాలుగుదశాబ్దాల క్రితం ఉత్తరం ద్వారా తెలిసింది. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. పెరిగిన టెక్నాలజీ అనుగుణంగా ప్రస్తుతం కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎక్కువైంది. లేఖ ప్రత్యేకతను ప్రజానీకం గుర్తించలేకపోతున్నారు. – గాంధారి మురళీధర్,
రిటైర్డ్ టీచర్, వడ్యాల్
సేవల్లో మార్పులు
వ్యక్తిగత కుటుంబ పరమైన ఉత్తరాల ప్రాధాన్యత తగ్గుతోంది. రాఖీ పర్వదినం వంటి సందర్భాల్లో మాత్రం తోడబుట్టిన వారికి రాఖీ పంపిణీ ఇప్పటికీ పోస్ట్ ద్వారానే కొనసాగుతోంది. పోస్టాఫీస్ ఆధునాతన సేవలతో మార్పులు జరుగుతున్నాయి. – కె.వెంకట్‌రావు,
సబ్ పోస్ట్‌మాస్టర్ గ్రేడ్–2, నిర్మల్

మానసికంగా తీరనిలోటు

మానసికంగా తీరనిలోటు