
నిషేధిత గుట్కా పట్టివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాపల్లి స్టేజీ వద్ద శనివారం పోలీసుల తనిఖీల్లో భారీగా నిషేధిత గుట్కా పట్టుబడింది. హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచి ర్యాల వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని అనుమానంతో తనిఖీ చేశారు. నిషేధిత గుట్కా బ్యాగులు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన 30బ్యాగుల గుట్కా విలువ సుమారుగా రూ.1.70 లక్షలు ఉంటుందని, గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, గంగాధర్, సత్యనారాయణ, తిరుపతి పాల్గొన్నారు.