
బస్టాండ్లలో పండుగ రద్దీ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో శనివారం ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు కిటకిటలాడాయి. రాఖీ పండుగ కావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే ప్రయాణికులతో మంచిర్యాల బస్‌స్టేషన్ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. బస్సులన్నీ మహిళ ప్రయాణికులతో నిండిపోయాయి. బస్సు వచ్చిందంటే చాలు సీట్ల కోసం పరుగులు తీశారు. బస్సుల సమాచారం అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఇంకోవైపు ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించారు. హైదరాబాద్‌కు వెళ్లే బస్సులన్నీ ముందస్తు రిజర్వేషన్లతో నిండిపోయాయి. బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాశారు. రద్దీకి అనుగుణంగా ఆయా రూట్లలో బస్సులు నడిపినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు.