
ఆదివాసీల హక్కులను కాపాడుకుందాం
● రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి ● దండేపల్లిలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు
దండేపల్లి: ఆదివాసీల హక్కులను కాపాడుకోవాలని రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. దండేపల్లిలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాళ్లపేటలో కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి దండేపల్లి వరకు ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. దండేపల్లి అంగడిబజారులో ఆదివాసీ జెండాను తిరుపతి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కనక జంగు, ఆదివాసీ సంఘాల నాయకులు రాంపటేల్, సోము, కాంతరావు, జలపతి, అర్జున్, రవి, అనంత్, నరేందర్, కిషన్, విక్రమ్, ఎల్లయ్య, లాల్‌సాబ్, రాజేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.