
రాఖీ సంబరం
సెల్ఫీ విత్ రాఖీ
నస్పూర్/నెన్నెల: జిల్లాలో రాఖీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. శనివారం అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టారు. నస్పూర్‌లో శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 గని కార్మికుడు జాడి రాజ్‌కుమార్ తన అక్కాచెల్లెలు మమత, మళ్లీశ్వరిలతో కలిసి మొక్కకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణ, ఇంటి ఆవరణలో పెంచిన మొక్కలకు రక్షణగా ఉంటామని తెలియజేయడానికి రాఖీ కట్టినట్లు తెలిపారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నెన్నెల మాజీ ఎంపీపీ రమాదేవి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సింగతి శ్యామల ఆయన నివాసంలో రాఖీ కట్ట శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నయ్య వారికి కానుకలు అందజేశారు. బీఆర్‌ఎస్ నాయకులు ప్రతాప్‌రెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు.
రాఖీ పండుగ సందర్భంగా సెల్ఫీ విత్ రాఖీ పేరిట ఫొటోలను ‘సాక్షి’ ఆహ్వానించగా విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు రాఖీ వేడుకల ఫొటోలను పంపించారు.
– మరిన్ని ఫొటోలు 9లోu
యశ్వంత్‌కు రాఖీ కడుతున్న సోదరీమణులు, మంచిర్యాల

రాఖీ సంబరం

రాఖీ సంబరం

రాఖీ సంబరం

రాఖీ సంబరం

రాఖీ సంబరం

రాఖీ సంబరం