
ఘనంగా శ్రావణ పౌర్ణమి జాతర
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం శ్రావణపౌర్ణమి జాతర ఘనంగా జరిగింది. జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యదేవుణ్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 196 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలు రద్దీగా కనిపించాయి. ఆలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారు. సత్యనారాయణస్వామిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల నాయకులు ఉన్నారు.
అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..
సామూహిక సత్యనారాయణవ్రతాలు..

ఘనంగా శ్రావణ పౌర్ణమి జాతర