
తెలంగాణ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టాలి
బెల్లంపల్లి: తెలంగాణ రాష్ట్రం పేరుతో న్యూఢిల్లీకి ప్రత్యేక సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు ఫణి కోరారు. గురువారం ద.మ రైల్వేజోన్ సికింద్రాబాద్ సీపీటీఎం రవిచందర్‌ను రైల్వే నిలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ రైలును హైదరాబాద్–న్యూఢిల్లీకి వయా కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల మీదుగా నడిపించాలని సూచించారు. పెద్దపల్లి జంక్షన్‌లో తిరువనంతపురం స్వర్ణ జయంతి వీక్లీ, వైన్ గంగా బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఓదెలలో కరీంనగర్–తిరుపతి బై వీక్లీ సూపర్ ఫాస్ట్, విశాఖపట్నం స్వర్ణజయంతి బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును మంచిర్యాలలో ఆపాలని విన్నవించారు. బల్లార్షా–కాజీపేట ఎక్స్‌ప్రెస్ రైలును చర్లపల్లికి, కాచిగూడ–కరీంనగర్ డెము రైలును పెద్దపల్లి, తిరుపతి–కరీంనగర్ రైలును నిజామాబాద్‌కు, రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును బోధన్‌కు, నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలును కాజీపేటకు పొడిగించాలని కోరారు. ఐఆర్‌సీటీసీ రైల్వే రిజర్వేషన్ పోర్టల్‌లో పెద్దపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, జమ్మికుంట, రామగుండంలో ఏవైతే ప్రయోగాత్మకంగా రైళ్ల హాల్ట్‌లను నవీకరించలేదో, వాటి గురించి సీపీటీఎంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభానికి, ఆయా రైల్వే స్టేషన్లలో ప్రతిపాదిత రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తామని సీపీటీఎం హామీ ఇచ్చినట్లు ఫణి తెలిపారు.