
లాభాల బోనస్ ప్రకటించాలి
నస్పూర్: సింగరేణి యాజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభాల్లో నుంచి కార్మికులకు బోనస్ వెంటనే ప్రకటించాలని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నాయకులతో కలిసి నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. లాభాల్లో 35శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం 7న అన్ని గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన, 14న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, 21న కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి త్వరలో 11 ఏరియాల్లో రణభేరి యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శులు ఏనుగు రవీందర్‌రెడ్డి, జీవన్‌జోయల్, నాయకులు రాంశెట్టి నరేందర్, స్వామి, తిరుపతి రాజు, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, జీవన్, ప్రకాశ్‌రావు, రౌతు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.