● మళ్లీ ముఖం చాటేసిన వరుణుడు.. ● రెండు నెలల్లో 30 శాతం లోటే.. ● వెలవెలబోతున్న జలాశయాలు ● వర్షాభావంతో రైతుల్లో ఆందోళన ● ఖరీఫ్‌ సాగుపై ప్రభావం | - | Sakshi
Sakshi News home page

● మళ్లీ ముఖం చాటేసిన వరుణుడు.. ● రెండు నెలల్లో 30 శాతం లోటే.. ● వెలవెలబోతున్న జలాశయాలు ● వర్షాభావంతో రైతుల్లో ఆందోళన ● ఖరీఫ్‌ సాగుపై ప్రభావం

Aug 4 2025 4:34 AM | Updated on Aug 4 2025 12:04 PM

● మళ్

● మళ్లీ ముఖం చాటేసిన వరుణుడు.. ● రెండు నెలల్లో 30 శాతం

ముదిరిన నారు వేసుకోవద్దు..

నారు పోసుకుని 30 రోజులు దాటిన నారు నాట్లు వేయొద్దు. అలా వేస్తే చీడపీడలు వ్యాపించి దిగుబడి తగ్గుతుంది. తప్పనిసరిగా రైతు చిగుర్లు తుంచి రెండు మూడు మొలకలను నాట్లు వేసుకోవాలి. ఎరువులు మోతాదు సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా వాడాలి. 40 రోజులు దాటిన నారు వేసుకోకపోవడం మంచిది. 90 నుంచి 110 రోజుల్లో దిగుబడి వచ్చే వరి డ్రమ్‌సీడర్‌, నేరుగా వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలి.

– రాజశేఖర్‌,

ఆదిలాబాద్‌ కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ఈ ఏడాది నెలకొన్న వర్షాభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాలు జిల్లాలోకి వచ్చి రెండు నెలలు గడిచినా... ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు గత నెలలో రెండు మూడు భారీ వర్షాలు ఆశలు రేకెత్తించినా.. తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. వారం రోజులుగా చినుకు జాడలేదు. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే 30% లోటు ఉంది. జిల్లాలో 487.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 340.4 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 580.4 మిల్లీమీటర్లతో 20% అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది, భీమిని, బెల్లంపల్లి మినహా మిగిలిన 16 మండలాల్లో 20–50% వర్షపాతం లోటు నెలకొంది. ఈ పరిస్థితి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఖరీఫ్‌ సాగుకు ఆటంకం..

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా ఉండగా, ఇప్పటివరకు కేవలం 47 వేల ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. సుమారు 70–80 వేల ఎకరాల్లో నారు పోసిన రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. నారు ముదిరిపోతుండడంతో, నాట్లు వేయాలా వద్దా అని సంకోచిస్తున్నారు. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండకపోవడంతో, ఆయకట్టు కింద సాగు చేసే రైతులు నీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు నాట్లు వేయడం కన్నా.. బీడుగా వదిలేయడం మంచిదని భావిస్తున్నారు.

ఇతర పంటల పరిస్థితి ఇలా..

జిల్లాలో పత్తి, వరి ప్రధాన పంటలుగా ఉన్నాయి. 1.58 లక్షల ఎకరాల పత్తి సాగు లక్ష్యంలో 1.57 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కంది, మొక్కజొన్న, పెసర వంటి ఇతర పంటలు 12 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. అయితే, వర్షాభావంతో పత్తి పంటకు నీటితడి అందక, ఎదుగుదలలో లోపం ఏర్పడుతోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు స్వల్పకాలిక వరి రకాలను ఆగస్టు 15 వరకు డ్రమ్‌సీడర్‌ లేదా వేద పద్ధతి ద్వారా సాగు చేయాలని సూచిస్తున్నారు.

జలాశయాలు ఖాళీ..

జిల్లాలో 40 వేల ఎకరాలు బావులపై, 67 వేల ఎకరాలు చెరువులు, ప్రాజెక్టుల కాల్వలపై, 35–45 వే ల ఎకరాలు వర్షాధార సాగుపై ఆధారపడి ఉన్నా యి. అయితే, జలాశయాలు కనీస నీటి మట్టానికి చేరుకోకపోవడంతో, కేవలం 37 ఎకరాల్లోనే వరినా ట్లు వేశారు. నీటి నిల్వ లేకపోవడంతో రైతులను నా ట్లు వేయడానికి సంకోచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాలు కురవకపోవడంతో నారు మళ్ల ను కాపాడుకోవడం రైతులకు సవాల్‌గా మారింది.

ఆగస్టుపై ఆశలు..

నాలుగేళ్లుగా ఆగస్టు రెండో వారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది కూడా ఆగస్టు వర్షాలపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత నెల 20–24 తేదీల మధ్య మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కానీ, ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. వ్యవసాయ అధికారులు దీర్ఘకాలిక వరి రకాలను వేసుకోవద్దని, స్వల్పకాలిక రకాలను మాత్రమే ఈ నెలాఖరు వరకు నాటాలని సూచిస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకు విత్తుకున్న పంటలుపంట ఎకరాలు పత్తి 1,57,564

వరి 47,972

కందులు 461

మొక్కజొన్న 133

పెసర్లు 93

ఇతర పంటలు 980

మొత్తం 2,07,203

● మళ్లీ ముఖం చాటేసిన వరుణుడు.. ● రెండు నెలల్లో 30 శాతం 1
1/1

● మళ్లీ ముఖం చాటేసిన వరుణుడు.. ● రెండు నెలల్లో 30 శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement