యువకవుల సమ్మేళనం పోస్టర్ల విడుదల
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే యువ కవుల సమ్మేళనం పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సోమవారం ఆయన నివాసంలో విడుదల చేశారు. జాగృతి నాయకులు ఐద ప్రశాంత్ మాట్లాడుతూ జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ యువ కెరటాలు శీర్షికతో కల్వకుంట్ల కవిత అధ్యక్షతన హైదరాబాద్ తెలంగాణ సరస్వతి పరిషత్‌లో ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ అస్తిత్వం, తాత్వికత, జీవన విధానం చరిత్ర, భాష, సంస్కృతి, ఉద్యమం అనే అంశాలపై యువ కవులకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు మే 26లోపు మెయిల్(kavitha.telangana@gmail.com)కు పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పడాల రవీందర్, పుల్లూరి మౌనిక, రాకేశ్, బిల్లా మారుతి, గడ్డం మహేశ్, తోట రంజిత్, వికాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో కార్మికుడికి గాయాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. టూటౌన్ ఎస్సై కే.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి ఏరియా కాసిపేటగనిలో కోల్ కట్టర్ బానోత్ పృథ్విరాజ్ ఆదివారం మధ్యాహ్నం మోటార్‌సైకిల్‌పై తాండూర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి మందమర్రికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో బైపాస్ రోడ్డు విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు ఎదురుగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. పృథ్విరాజ్ కాలు పాదం వద్ద నుజ్జునుజ్జయింది. స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు, అక్కడి నుంచి సోమవారం హైదరా బాద్‌కు తరలించారు. బాఽధితుడి భార్య దివ్య ఫిర్యా దు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.


