కొడుకు అంత్యక్రియలకు వెళ్తూ తండ్రి మృతి | - | Sakshi
Sakshi News home page

కొడుకు అంత్యక్రియలకు వెళ్తూ తండ్రి మృతి

May 19 2025 2:34 AM | Updated on May 19 2025 2:34 AM

కొడుక

కొడుకు అంత్యక్రియలకు వెళ్తూ తండ్రి మృతి

బెల్లంపల్లి: కొడుకు అంత్యక్రియలకు వెళ్తూ తండ్రి మృతి చెందిన సంఘటన బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు బెల్లంపల్లి మున్సిపాలిటీ నంబర్‌ 2 ఇంక్‌లైన్‌ బస్తీకి చెందిన బొమ్మ కుమార్‌ (60)కుమారుడు విజయ్‌కుమార్‌ (36) కొత్తగూడెంలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం విజయ్‌కుమార్‌ అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం రావడంతో కుమార్‌ కారులో కొత్తగూడెం బయలుదేరాడు. మార్గమధ్యలో గుండెపోటు రావడంతో కారులోనే మృతి చెందాడు. కుమారుడి కడచూపు కోసం వెళ్తూ తండ్రి కూడా తిరిగిరాని లోకానికి వెళ్లడం అందరి హృదయాలను కలిచి వేసింది. ఒకరోజు వ్యవధిలో తండ్రీకొడుకు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి అంత్యక్రియలు కొత్తగూడెంలో, తండ్రి దహన సంస్కారాలు బెల్లంపల్లిలో నిర్వహించారు.

టిప్పర్‌ ఢీకొని యువకుడు..

భైంసారూరల్‌: టిప్పర్‌ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ నైలు తెలిపిన వివరాల మేరకు కుభీర్‌ మండలంలోని సాంగ్వి గ్రామానికి చెందిన గంగాప్రసాద్‌ (21) శనివారం పనినిమిత్తం ద్విచక్ర వాహనంపై భైంసాకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో భైంసా–కుభీర్‌ ప్రధాన రహదారిపై మిర్జాపూర్‌ గ్రామ సమీపంలో టిప్పర్‌ ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్ల డించారు.

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి ..

కాసిపేట: మండలంలోని దేవాపూర్‌ అంగడి బజార్‌కు చెందిన మన్నే సాంసన్‌ ప్రశాంత్‌ కుమార్‌ (45) శుక్రవారం రాత్రి విద్యుత్‌ షాక్‌తో మృతి చెందినట్లు దేవాపూర్‌ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నీటి కోసం ఇంట్లోని బావివద్దకు వెళ్లి కరెంట్‌ స్వీచ్‌ ఆన్‌చేయగా నీళ్లు రాక పోవడంతో మోటర్‌కు కట్టిన జీఐ వైర్‌ను పట్టుకుని కదిలిస్తున్న క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం మృతుని సోదరి మన్నే సలోమి ప్రియదర్శిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరు ..

నర్సాపూర్‌ (జి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండల కేంద్రానికి చెందిన అబ్దుల్‌ ఇర్ఫాన్‌ అలీ (38) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్‌ అలీ ఈ నెల 7న లారీలో ధాన్యం లోడును లోకేశ్వరం మండలం రైస్‌మిల్లులో వదిలేసి ద్విచక్ర వాహనంపై నర్సాపూర్‌ (జి) వస్తుండగా అర్లి ఎక్స్‌ రోడ్‌ దాటిన తర్వాత 61వ జాతీయ రహదారిపై బైక్‌ అదుపుతప్పి కిందపడడంతో గాయాలయ్యాయి. నిజామాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య అంజుం బేగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శంకర్‌ తెలిపారు.

కొడుకు అంత్యక్రియలకు వెళ్తూ తండ్రి మృతి
1
1/2

కొడుకు అంత్యక్రియలకు వెళ్తూ తండ్రి మృతి

కొడుకు అంత్యక్రియలకు వెళ్తూ తండ్రి మృతి
2
2/2

కొడుకు అంత్యక్రియలకు వెళ్తూ తండ్రి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement