ఇంటికే పౌష్టికాహారం
● వేసవి సెలవుల నేపథ్యంలో కొత్త విధానం ● అంగన్‌వాడీ లబ్ధిదారులకు అందజేత
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు
అంగన్‌వాడీ కేంద్రాలు 969
గర్భిణులు 4,245
బాలింతలు 3,186
చిన్నారులు 45,455
మంచిర్యాలటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాయి. వేసవి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెలలో సెలవులు ప్రకటించింది. పౌష్టికాహారం కోసం లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదు. దీంతో ఆహార సరఫరా నిలిచిపోతోంది. ఈ సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు వారానికి ఒకసారి నేరుగా పౌష్టికాహారం అందించే విధానం అమల్లోకి తెచ్చింది.
లబ్ధిదారులకు ఊరట
మే నెలలో ఎండల తీవ్రత కారణంగా గర్భిణులు, చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు రాకపోవడంతో పౌష్టికాహారం అందడం ఆగిపోయేది. ఈ సమస్యను గుర్తించిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల యూనియన్‌లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందించాయి. దీంతో, మే 1 నుంచి 15 వరకు టీచర్లు, 16 నుంచి 31 వరకు ఆయాలు కేంద్రాలను తెరిచి, లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అంగన్‌వాడీ నిర్వాహకులతోపాటు లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
జిల్లాలో పౌష్టికాహార సరఫరా ఇలా..
జిల్లాలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటిలో 74 మినీ, 895 ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. 2023లో మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల నుంచి 4,245 మంది గర్భిణులు, 3,186 మంది బాలింతలు, 45,455 మంది చిన్నారులు పౌష్టికాహారం పొందుతున్నారు. రోజూ భోజనం, గుడ్డు, పాలు, స్నాక్స్ అందించాల్సి ఉంటుంది. వేసవి సెలవుల సమయంలో వారానికి ఒకసారి నేరుగా సరుకులు పంపిణీ చేస్తున్నారు.
సవాళ్లు, పర్యవేక్షణ అవసరం
కొందరు లబ్ధిదారులు కేంద్రాలకు రాకపోవడం, టీచర్లు/ఆయాలు పంపిణీలో నిర్లక్ష్యంచేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవచ్చు. ఈ నేపథ్యంలో, జిల్లా ఉన్నతాధికారులు కఠిన పర్యవేక్షణతో పౌష్టికాహా రం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కొత్త విధానం లబ్దిదారులకు నిరంతర ఆహార సరఫరాకు దోహదపడనుంది.
సరుకులు అందేలా చర్యలు
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల ల బ్ధిదారులకు పౌష్టికా హారానికి సంబంధించిన సరుకులు సక్రమంగా అందించేలా చర్యలను తీసుకుంటున్నాం. టీచర్లు, ఆయాలు 15 రోజుల చొప్పున అంగన్‌వాడీ కేంద్రాలను తెరిచి ఉంచాల్సిందే. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం ఉండడంతో, అంగ న్‌వాడీ కేంద్రాలకు చిన్నారులు వచ్చేలా టీచ ర్లు తగు చర్యలను తీసుకునేలా చూస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులు వచ్చినప్పుడు ఎలాంటి పౌష్టికాహారం తీసుకుంటా రో, కేంద్రాలకు రాకున్నా అదే పౌష్టికాహారం తీసుకునేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం.
– రవూఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి
ఇంటికే పౌష్టికాహారం


