
మానవతామూర్తులు
● వైద్యరంగంలో నర్సుల పాత్ర కీలకం ● నిరంతరం రోగులకు సేవలు ● నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
వైద్యరంగంలో నర్సులు.. కనిపించే దేవతలు.. సేవామూర్తులు. కాలిన గాయాలతో దవాఖానలకు వచ్చే బాధితులైనా.. రోడ్డు ప్రమాద క్షతగాత్రులైనా.. పురిటినొప్పులతో వచ్చే గర్భిణులైనా.. మరి ఇంకెవరైనా తోబుట్టువులా మొదట పలుకరించేది వాళ్లే. రోగులే దైవంగా సేవలందిస్తూ వైద్య రంగానికే వన్నె తెస్తుండగా, నేడు (సోమవారం) అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
– నిర్మల్‌చైన్‌గేట్/ఆసిఫాబాద్‌అర్బన్
ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా
నర్సింగ్ వృత్తికి హుందాతనం తెచ్చిన ఫ్లోరెన్స్ నై టింగేల్ జయంతిని పురస్కరించుకుని ఏటా మే12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన కృషిని తలుచుకుంటూ ఏటా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలో ఏటా నర్సింగ్ విభాగంలో వి శిష్ట సేవలు అందిస్తున్న నర్సులకు రాష్ట్రపతి అవా ర్డులు అందించి సముచితంగా సత్కరిస్తున్నారు.

మానవతామూర్తులు