
యువతిని వేధించిన ఒకరి అరెస్ట్
మందమర్రిరూరల్: ఆన్‌లైన్‌లో నకిలీ మెయిల్ క్రియే ట్ చేసి మందమర్రికి చెందిన యువతికి అసభ్యకర మెయిల్స్ పంపించే వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సర్కిల్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై రాజశేఖర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. మందమర్రి పట్ట ణానికి చెందిన యువతి వర్క్ ఫ్రం హోం చేసుకుంటోంటుంది. గత మార్చి నుంచి ఒక వ్యక్తి నకిలీ ఈ మెయిల్ ఐడీ ద్వారా ఆమె స్నేహితులను ట్యాగ్ చే స్తూ పదేపదే అశ్లీల, అభ్యంతరకర సందేశాలు పంపిస్తూ వేధించాడు. సదరు యువతి గత జూన్ 7న ఆ వ్యక్తిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నకిలీ మెయిల్ ఐడీ మూలాలను గుర్తించగా ఆ వ్యక్తి ని హైదరాబాద్‌కు చెందిన నెల్లి నిఖిల్‌బాబుగా నిర్ధారించామని పేర్కొన్నారు. ఈ మేరకు అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి మందమర్రి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. గతంలో సదరు యువతి నిఖిల్‌తో సహోద్యోగి కాగా అతడు ప్రేమిస్తున్నానని చెప్పగా తిరస్కరించింది. దీంతో సదరు యువతిపై పగ పెంచుకుని వేధించినట్లు నిఖిల్ అంగీకరించాడు. దీంతో అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.