
దర్గా ఆభరణాలు చోరీ
● ఇద్దరు నిందితుల అరెస్ట్
సారంగపూర్: మండలంలోని తాండ్ర(జి) గ్రా మానికి చెందిన అన్నుసాబ్ ఇంట్లోంచి వెండివస్తువులు అపహరించిన కేసులో ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించినట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా తె లిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ సబ్‌డివిజన్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. తాండ్ర(జి) గ్రామానికి చెందిన అన్నుసాబ్ స్థానిక దర్గాలో పూజారిగా పనిచేసే వాడు. భక్తులు హుండీలో వెండి ఆభరణాలు సమర్పించి మొక్కు తీర్చుకునేవారు. ఈ ఆభరణాలు హుండీనుంచి తీసి ఇనుపపెట్టెలో పెట్టి అన్నుసాబ్ తన ఇంట్లో భద్రపరిచేవాడు. ఈక్రమంలో మూడు నెలల క్రితం అన్నుసాబ్ అనా రోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆయన కు మారుడు మహ్మద్ జమీల్ ఇటీవల పీరీల పండుగ సందర్భంగా దర్గాలో అలంకరించడానికి వెండివస్తువులు ఉన్న పెట్టెను వెతకగా కనిపించలేదు. దీంతో వెంటనే సారంగపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు తెలుసుకున్న నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ గాలింపు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు తాండ్ర(జి) గ్రామ సమీపంలో తనిఖీ చేపట్టి మహ్మ ద్ రహీంను అదుపులోకి తీసుకుని విచారించా రు. దీంతో రహీం తానే వెండివస్తువులు ఉన్న పెట్టెను దొంగిలించినట్లు ఒప్పుకొన్నాడు. దీంతో అతడితోపాటు దొంగతనానికి ప్రోత్సహించి, దొంగిలించిన వస్తువులు కొనుగోలు చేసిన దిలావర్‌పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన నాంపల్లి వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఇద్దరికి రిమాండ్ విధించినట్లు ఏఎస్పీ తెలిపా రు. కేసు చాకచక్యంగా వేగంగా ఛేదించిన రూర ల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుళ్లు ఆకా శ్, రవిని ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.