
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
ఉట్నూర్‌రూరల్: మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముసల్‌పాడ్ గ్రామానికి చెందిన వెడ్మ గణేశ్ (33)కు ఆరేళ్ల క్రితం శ్రీదేవితో వివాహమైంది. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీదేవి రాఖీ పండు గ సందర్భంగా ఈనెల 20న తుమ్మగూడ గ్రామాని కి వెళ్లింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేశ్ మద్యం తాగిన మైకంలో పురుగుల మందు తాగాడు. భార్య శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా గణేశ్ కిందపడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నాడు. గమనించిన ఆమె తన భర్తను చుట్టుపక్క ల వారి సాయంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా గణేశ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.