
‘అల్ఫోర్స్’ విద్యార్థులకు అభినందన
‘ట్రినిటి’ విజయభేరి
కరీంనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు 405, 430, 560, 697, 730, 760, 791, 859, 934,1104, 1166, 1546, 1619, 1795, 1950తో పాటు మొత్తం 89మందికి పైగా విద్యార్థులు 10వేలలోపు ర్యాంకులు సాధించారు. విద్యార్థులను విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ట్రినిటి జూనియర్ కళాశాలలు విద్యా రంగంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయని తెలిపారు. ఐఐటీ–జేఈఈ(మెయిన్), అడ్వాన్స్‌డ్, నీట్, ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించారని ప్రశంసించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి అభినందించారు. ఈ విజయానికి బాటలు వేసిన అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు.

‘అల్ఫోర్స్’ విద్యార్థులకు అభినందన