కళాశాల భవన నిర్మాణం నా అదృష్టం
● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
లక్సెట్టిపేట: తాను చదువుకున్న కళాశాల భవన నిర్మాణం చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రే మ్‌సాగర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాల పక్కా భవన ని ర్మాణ పనులను పరిశీలించారు. చిన్ననాటి జ్ఞా పకాలు, తను చదువుకున్న రోజులను గుర్తు చే సుకున్నారు. ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాన ని, అటువంటి కళాశాల భవనం నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు స్వయంగా చూసుకుంటున్నాన ని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అ నంతరం ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి నిర్మాణ ప నులను పరిశీలించి వర్షాకాలం సమీపించక ముందే పూర్తి చేసి ప్రారంభం చేయాలని అధి కారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ.ఆరీఫ్, గడ్డం త్రిమూర్తి, చింత అశోక్, శ్రీనివాస్, పింగిళి ర మేష్, స్వామి, శ్రీధర్, కార్యకర్తలు, వైద్యాధికా రి శ్రీనివాస్, పాల్గొన్నారు.


