దేశం కోసం దేనికై నా సిద్ధమే..!
మంచిర్యాలక్రైం: ‘నా దేశానికి ముప్పు తలపెడుతున్న శత్రుమూకలను ఏరిపారేసేందుకు దేనికై నా సిద్ధమే’నని మంచిర్యాలకు చెందిన ఆర్మీ హ వల్దార్ కొప్పుల అశోక్ అన్నారు. గత నెల మార్చి 28న సెలవులపై ఇంటికి వచ్చారు. పహల్గాం ఘ టన, పాకిసాన్–ఇండియా మధ్య యుద్ధంతో సెలవుల్లో ఉన్న ఆర్మీ అధికారులు వెంటనే విధుల్లో చేరాలని కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశించడంతో అశోక్ విధుల్లో చేరేందుకు శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను ఇంటి వద్ద ‘సాక్షి’ పలుకరించింది. ఆయన మాటల్లోనే..‘‘ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమై న సందర్భంగా ఎమర్జెన్సీ కాల్ రావడంతో వెళ్లాల్సి వస్తోంది. రాజస్థాన్ సరిహద్దులో విధులు ని ర్వహిస్తున్నాం. ఆర్మీ ఉద్యోగం అంటే మొదట్లో ఒక ఫ్యాషన్‌గా ఉండేది. ఉద్యోగంలో చేరిన తర్వా త ఆర్మీ ఉద్యోగం అంటే ఫ్యాషన్ కాదు. ఆర్మీ అంటే దేశభక్తి, దేశ సేవ చేసే భాగ్యం దక్కిందనే గౌర వం ఉంది. విధుల్లో ఉన్నప్పుడు కుటుంబం గుర్తుకు రాదు. కుటుంబం అంటేనే నా దేశం. నా దేశాన్ని కాపాడుకుంటే నా కుటుంబాన్ని కాపాడుకున్నంత ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాం. ఈసారి కుటుంబాన్ని తీసుకెళ్దామని అనుకున్న. యుద్ధ వాతావరణం కారణంగా తీసుకెళ్లడం లేదు. రాజస్థాన్ వెళ్లి ఆర్మీ ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసిన తర్వాత ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లేందుకు సిద్ధమే. ఒకవేళ యుద్ధంలో పాల్గొనే అవకాశం వస్తే పాక్ ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తా..’’ అన్నారు.
ఆర్మీ హవల్దార్ కొప్పుల అశోక్
అత్యవసర పిలుపుతో విధుల్లోకి..
దేశం కోసం దేనికై నా సిద్ధమే..!


