ఎన్‌ఎస్‌ఎస్ సలహా కమిటీ సభ్యుడిగా శ్రీనివాస్
మంచిర్యాలఅర్బన్: కేంద్ర ప్రభుత్వ, యువజన, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సే వా పథకం(ఎన్‌ఎస్ ఎస్) కాకతీయ యూని వర్సిటీ సలహా కమిటీ సభ్యుడిగా మంచిర్యాల కు చెందిన ఆర్.శ్రీనివాస్‌ను నియమిస్తూ వైస్ చాన్స్‌లర్ ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీ స్థాయిలో నలుగురు ప్రిన్సిపాల్‌లను సభ్యులుగా నియమిస్తుండగా, ఇద్దరు ప్రభుత్వ, ఇద్దరు ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్‌లకు అవకాశం కల్పిస్తా రు. ప్రైవేట్ కళాశాలల నుంచి శ్రీనివాస్‌ను నియమించారు. శ్రీనివా స్‌ను జాతీయ సేవా పథకం జిల్లా కన్వీనర్ చంద్రమోహన్‌గౌడ్ అభినందించారు.


