జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలటౌన్: జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ కుమార్ దీ పక్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రా వుతో కలిసి మంచిర్యాలలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.16.06 కోట్ల తో ఆరు వరుసల రహదారి, రూ.1.57 కోట్లతో రంగంపేట్‌లో డ్రెయినేజీ, రోడ్లు, రూ.65 లక్షలతో బృందావనంలో డ్రెయినేజీ, రూ.2.91 కోట్లతో రాజ రాజేశ్వరి కాలనీలో రోడ్లు, రూ.2.70 కోట్లతో సూర్యనగర్‌లో డ్రెయినేజీ, రూ.2 కోట్లతో హమాలీవాడ నుంచి తిలక్‌నగర్ వరకు డ్రెయినేజీ, రూ.3.37 కోట్లతో రాజీవ్‌నగర్‌లో రోడ్లు, రూ.2 కోట్లతో దొరగారిపల్లెలో డ్రెయినేజీ పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంచిర్యాలను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తామని తెలి పారు. ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు హైదరాబాద్–కరీంనగర్–చాందా రహదారిపై 251/9 నుంచి 255/7 వరకు బీటీ రహదారితో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రెయినేజీలతో రవాణా సౌకర్యం మెరుగవుతాయని వివరించారు. రోడ్లు భవనాల శాఖ ఈఈ భవర్‌సింగ్, కమిషనర్ శివాజీ పాల్గొన్నారు.


