గిరిజన గురుకులాల్లో 99 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

గిరిజన గురుకులాల్లో 99 శాతం ఉత్తీర్ణత

May 2 2025 1:21 AM | Updated on May 2 2025 1:21 AM

గిరిజన గురుకులాల్లో   99 శాతం ఉత్తీర్ణత

గిరిజన గురుకులాల్లో 99 శాతం ఉత్తీర్ణత

ఉట్నూర్‌రూరల్‌: పది ఫలితాల్లో గిరిజన గురుకులాలు 99 శాతం ఉత్తీర్ణత సాధించాయని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. గత విద్యాసంవత్సరం 96.33 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి మూడు శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 గిరిజన బాల, బాలికల గురుకులాల్లో బాలికలు 591 మంది, బాలురు 253 మంది ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో మిషన్‌ లక్ష్యం కార్యక్రమాన్ని అమలు చేయడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కృషి ఉందంటూ పీవో, ఆదిలాబాద్‌ ఆర్సీవో అగస్టిన్‌ అభినందించారు.

‘పరిహారం అందేలా చూస్తాం’

నెన్నెల: వడగళ్ల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరి హారం అందేలా చూస్తామని బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. గురువారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి గుండ్లసోమారం, బొప్పారం, చిత్తాపూర్‌, ఆవుడం, గంగారాం, మైలారం, గొల్లపల్లి గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రై తులతో మాట్లాడారు. గుండ్లసోమారంలో ఇళ్లు కూ లిపోయిన బాధితులకు పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. భీమిని ఏడీ ఏ సురేఖ మాట్లాడుతూ మండలంలో సుమా రు 150 ఎకరాల్లో వరి, ఐదు ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక పరి శీలనలో తేలిందని అన్నారు. సుమారు 300 ఎకరాల్లో వందమంది రైతులకు సంబంధించిన మామిడి కాయలు నేలరాలినట్లు గుర్తించామని ఉద్యానవన అధికారి అరుణ్‌ తెలి పారు. తహసీల్దార్‌ మహేంద్రనాథ్‌, ఏఓ సృజన, ఏఈఓలు రాంచందర్‌, శైని, మాజీ జెడ్పీటీసీ సింగతి శ్యామలరాంచందర్‌ పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో పశువుల దొంగలు!

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో రోడ్లపై పడుకుని ఉన్న పశువులను ఎత్తుకెళ్లిన దొంగలు పో లీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. జన్మభూమినగర్‌ ప్రాంతంలోఓ పశువును కొ ందరు ఎత్తుకెళ్లి ఆటోలో తరలిస్తుండగా పోలీ సులు అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. ఆటోడ్రైవర్‌తోపాటు మరో ముగ్గురిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement