
వన్యప్రాణుల కోసం నీటి కుంటల నిర్మాణం
జైపూర్: ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్లాంటేషన్, అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటి కుంటలు నిర్మిస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్‌డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్‌కుమార్ తెలిపారు. మండలంలోని కాన్కూర్ గ్రామ సమీపంలోగల టీజీఎఫ్‌డీసీ నీలగిరి ప్లాంటేషన్‌లో శుక్రవారం నీటి కుంట తవ్వించారు. ఈజీఎస్ కింద చేపట్టిన ఈ పనులను శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమై నీటి కోసం వన్యప్రాణులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీటి ఊటలున్న ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. నీరు నిల్వ ఉండేలా నీటి కుంటలు తవ్విస్తున్నట్లు పేర్కొన్నారు. కాన్కూర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్లాంటేషన్ వాచర్ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.
నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్న అటవీ సిబ్బంది