
ఇందిరమ్మ ఇళ్ల కోసం రాస్తారోకో
కొనసాగుతున్న నిరవధిక సమ్మె
బాసర: ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు చేపట్టిన నిరవధిక సమ్మె ఐదోరోజుకు చేరింది. శుక్రవారం బాసర రైల్వేస్టేషన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం శ్రీకాంత్ శ్రీరామ్, శేఖర్, రజిత, భానుప్రియ, ప్రశాంతి, ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
చెన్నూర్‌రూరల్: మండలంలోని కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామస్తులు శుక్రవారం చెన్నూర్–మంచిర్యాల ప్రధా న రహదారిపై రాస్తారోకో చేశారు. పంచా యతీలో 1,104 మంది ఇందిరమ్మ ఇళ్లకు ద రఖాస్తు చేసుకోగా 70మంది పేర్లు వచ్చాయని తెలిపారు. ఇందులో ఎల్లక్కపేటకు చెందిన ఆరుగురి పేర్లు మాత్రమే ఉన్నాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే పట్టించుకోవడంలేదని తెలిపారు. అధికారులు మళ్లీ సర్వే చేసి అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల కోసం రాస్తారోకో