
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ..
నిర్మల్‌టౌన్: ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ పరీక్షను ఒకరికి బదులు మరొకరు రాస్తూ ఇన్విజిలేటర్‌కు పట్టుబడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రాజేశ్ మీనా బుధవారం వివరాలు వెల్లడించారు. స్థానిక సోమవార్‌పేట్‌లో గల ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తున్నారు. దాసర్ల రత్నాకర్ అనే వ్యక్తి పరీక్ష రాయాల్సి ఉండగా అతని స్థానంలో కందుల జయవర్ధన్ పరీక్షకు హాజరయ్యాడు. ఇన్విజిలేటర్ అతని హాల్‌టికెట్ తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందజేయగా అక్కడకు చేరుకుని రత్నాకర్, జయవర్ధన్‌లపై కేసు నమోదు చేయడంతో పాటు అతని ఎగ్జామ్ పేపర్, హాల్ టికెట్ సీజ్ చేశారు.