కొనేపరిస్థితి లేదు
ఆసిఫాబాద్: పెరుగుతున్న ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనే పరిస్థితి లేదు. భవిష్యత్‌లో బంగారం ఆభరణంలా కాకుండా పొటోల్లో పెట్టుకునే పరిస్థితి ఉందది. ఇంకా పెరుగుతున్నాయే తప్ప దిగడం లేదు. ఇటీవల అరతులం కొనాలనుకున్నా.. ధర తగ్గుతుందనడంతో ఆగిపోయా.
– గుర్రాల హరిప్రియ, గృహిణి, ఆసిఫాబాద్
నియంత్రణ ఉండాలి
ఆసిఫాబాద్: పెరుగుతున్న బంగారం ధరలు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి. ముఖ్యంగా వివాహాల సందర్భంగా పేదలకు బంగారం కొనాలంటే మరింత కష్టంగా మారింది. బంగారం ధరలపై నియంత్రణ ఉండాలి.– కాచం వినేశ్, వ్యాపారి, ఆసిఫాబాద్
కొనలేని పరిస్థితి
మంచిర్యాలటౌన్: ఈ నెల 23న మా బాబు పెళ్లి ఉంది. బంగారం కొందామని వెళ్తే లక్ష రూపాయలకు చేరింది. పెళ్లికి తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాలి కాబట్టి ధర పెరిగినా కొనుగోలు చేశాం. వేల నుంచి లక్షల్లోకి చేరిన బంగారంను సామాన్యులు కొనలేని పరిస్థితి.
– పురెల్ల సుజాత, పాతమంచిర్యాల
కొనక తప్పదు
మంచిర్యాలటౌన్: మా కూతురు పెళ్లి ఈ నెల 24న ఉంది. బంగారం తప్పనిసరి కావడంతో ధర పెరిగినా కొనడం తప్పడం లేదు. లక్షకు చేరుతుందని ఊహించ లేదు. ధర పెరిగినా పెళ్లి కోసం కొనక తప్పదు.
– హబీబునీసా బేగం, మంచిర్యాల
కొనేపరిస్థితి లేదు
కొనేపరిస్థితి లేదు
కొనేపరిస్థితి లేదు


