
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యలు త్వరగా ప రిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధి కారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పీవోకు అ ర్జీలు అందించారు. సమస్యలు పరిష్కరించాలని కో రారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ప్రజా వాణికి పింఛన్, డబుల్ బెడ్రూం, స్వయం ఉపాధి పథకాల కోసం, వ్యవసాయం, రెవెన్యూ శాఖలకు సంబంధించిన 65 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీ టిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికా రులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.