గంజాయి కేసులో ఇద్దరి రిమాండ్
నేరడిగొండ: గంజాయి కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్సై శ్రీకాంత్‌లు తెలిపారు. వారి కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు కుంటాల ఎక్స్‌రోడ్‌లో నేరడిగొండకు చెందిన బత్తుల కిరణ్ అనే వ్యక్తిని తనిఖీ చేయగా 160 గ్రాముల గంజాయి లభించినట్లు పేర్కొన్నారు. ఆయనను విచారించగా దంసతండా గ్రామానికి చెందిన పెందూర్ లచ్చు అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు తెలిపాడు. కాగా లచ్చును విచారించగా తన వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిపాడు. అతని వద్ద నుంచి 290 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 450 గ్రాముల గంజాయి విలువ రూ.11,250 ఉంటుందన్నారు.
మావల పరిధిలో..
ఆదిలాబాద్‌రూరల్: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన అంబదాస్, గాదిగూడ మండలానికి చెందిన రాజు అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని తరలిస్తుండగా బుధవారం మావల పోలీసుస్టేషన్ పరిధిలో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు.


