డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు
● పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
మంచిర్యాలటౌన్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి జెడ్పీ బాలుర మైదానంలోని సభ ఏ ర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఐబీ చౌరస్తాలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలనతోపాటు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. డిప్యూటీ సీఎం వెంట రా ష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర సమాచార సాంకేతి క, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్, కామ ర్స్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫ రా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వ స్తారని వివరించారు. అనంతరం కాలేజీరోడ్డులో ని ర్మించిన మహాప్రస్థానం పనులను పరిశీలించి, ప్రా రంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ము న్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివాజీ, తహసీల్దార్ రఫతుల్లా పాల్గొన్నారు.


