మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల అభ్యసన సా మర్థ్యాల సాధనకు కృత్రిమ మేధ(ఏఐ)దోహదపడుతుందని సమగ్రశిక్ష ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ చౌదరి అన్నారు. మంచి ర్యాల సైన్స్ కేంద్రంలో గురువారం నుంచి కృతిమ మేధ పాఠాలు ప్రారంభించే 16 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మంగళవా రం శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనకబడిన పిల్లలకు కంప్యూటర్ ద్వారా కృత్రిమ మేథ సహాయంతో విద్యనందించటం ఎంతో గొప్ప విషయమన్నారు. విద్యార్థులకు స్వీయ ప్రేరణ, స్వీయభ్యసన అనుభవం చక్కగా కలుగుతుందని తద్వారా విద్యపై మక్కువ ఏర్పడి పాఠశాలకు వచ్చేలా చేయచ్చన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కో– ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, మస్టార్ ట్రైనర్లు శ్రీథర్, రాజగోపాల్, రజిత, 16 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


