ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ● పోలీసుస్టేషన్లలో తనిఖీ
కోటపల్లి/వేమనపల్లి/భీమిని: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆన్నారు. సోమవారం ఆయన కోటపల్లి, వేమనపల్లి మండలం నీల్వాయి, కన్నెపల్లి పోలీస్‌స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరి సరాలు, రికార్డులు పరిశీలించి సిబ్బందితో మా ట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉండే పోలీ స్‌స్టేషన్‌లో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫిర్యాదుదారుల కు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించాలని, ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నీల్వాయిలో మ హారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై అడిగి తెలుసుకున్నారు. గతంలో జరిగిన ఘట నలు, మావోయిస్టుల కదలికలు, సానుభూతిపరులు, మిలిటెంట్లపై ఆరా తీశారు. కన్నెపల్లిలో పోలీసుస్టేషన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో స్పెషల్‌బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఎన్‌ఐబీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్, ఎస్సై గంగారాం పాల్గొన్నారు.


