బెల్లంపల్లి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజే పీ ప్రభుత్వం పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రా ల ప్రాతి నిధ్యం తగ్గించే కుట్రలు చేస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్ ఆరోపించారు. సీపీఐ శత జయంతోత్సవాలు పురస్కరించుకు ని బెల్లంపల్లి గంగారాం విజ్ఞాన్ భవన్‌లో అసెంబ్లీ నియోజకవర్గస్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శంకర్ హాజరై మాట్లాడారు. 1925లో దేశంలో పురుడు పోసుకున్న సీపీఐ శతజయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పీడిత తాడిత అట్టడుగువర్గాలు, కార్మి కులు, కర్షకుల హక్కుల కోసం సీపీఐ అలు పెరుగని పోరాటాలు సాగిస్తోందని వివరించా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలు అవలంభిస్తోందన్నారు. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను దెబ్బతిస్తూ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతి నిధ్యం తగ్గించేందుకు కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. రైతు చట్టాలనుతుంగలో తొక్కి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు ఎం.వెంకటస్వామి, బి.పూర్ణిమ, మేకల దాసు, ఆర్.చంద్రశేఖర్, జిల్లా సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, దాగం మల్లేశ్, అక్కెపల్లి బాపు, సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, నాయకులు రాజేశ్, సంతోష్, మాణిక్యం, శ్రీధర్, బానేష్, రాజేశం, అమృత, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


