● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి: పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయం, ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. దండేపల్లి కేజీబీవీని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ‘పరీక్షలకు అంతా సిద్ధం అయ్యారా.. బాగా రాస్తారు కదూ..’ అంటూ ఆప్యాయంగా పలుకరించారు. అంతకు ముందు దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో శుక్రవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షా కేంద్రం ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం మండలంలోని నాగసముద్రం, మాకులపేట శివారులో పంట పొలాలను పరిశీలించారు. సాగునీరందక రైతులు పడే ఇబ్బందులపై తెలుసుకున్నారు. చివరి తడికి నీరందించేందుకు అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. దండేపల్లి పీహెచ్‌సీలో వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. ఎంపీడీవో ప్రసాద్, డీటీ విజయ, ఎంఈవో చిన్నయ్య, ఏవో అంజిత్‌కుమార్, ఆర్‌ఐ భూమన్న పాల్గొన్నారు.


