లక్సెట్టిపేట: ‘ఆస్పత్రి భవనం ప్రారంభమెప్పుడో’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. పనులను పరిశీలించిన ఆయన త్వరగా పూర్తి చేయాలని సూచించారు. త్వరలో ఆస్పత్రి ప్రారంభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు. పనుల్లో నాణ్యతను పరిశీలించి ఆపరేషన్ థియేటర్, ఇతర ప్రదేశాలు పరిశీలించారు. మార్చురీ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాని, టెండరు ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడుతామని అన్నారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.