బెల్లంపల్లి: మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన బాకం సత్తమ్మ తహసీల్దార్ కార్యాలయంలో ఇటీవల తన వ్యకిగత సమస్యపై దరఖాస్తు చేసుకుంది. గుంట విస్తీర్ణం కలిగిన తాను నివాసం ఉంటున్న ఇంటిని తన తమ్ముడి కుమారుడు బాకం సుమన్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని పేర్కొంది. తహసీల్దార్ జ్యోత్స్న, తాళ్లగురిజాల ఏఎస్సై, గి ర్దావరు, ఇతర సిబ్బంది బుధవారం ఆ గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇరువర్గాలను విచారించారు. ఫిర్యాదుదారు ఇల్లు ఆక్రమణకు గురి కాలేదని, కూలగొట్టలేదని నిర్ధారణకు వచ్చా రు. సత్తమ్మ, సుమన్ మధ్య ఉన్న తగాదాను పరిష్కరించి ఉపశమనం కలిగించారు. తహసీల్దార్ ప్రత్యేక చొరవతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగాయి.


