
పోస్టుకార్డులు చూపిస్తున్న రైతులు
చెన్నూర్: ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు రాశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని, రైతు భరోసా ద్వారా రూ.10 వేలు కాకుండా రూ.15 వేలు ఇవ్వాలని తెలిపారు. రూ.2 లక్షల రైతు రుణామాఫీ వెంటనే చేయాలని, రైతు కూలీలకు రూ.12 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. రైతులు పోస్టుకార్డుల ఉద్యమానికి బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, ఎంపీపీ మంత్రి బాపు, జెడ్పీటీసీ మోతె తిరుపతి, బీఆర్‌ఎస్ నాయకులు బుర్ర రాకేశ్, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.