మెట్ల పైనుంచి పడి వృద్ధుడి మృతి | Sakshi
Sakshi News home page

మెట్ల పైనుంచి పడి వృద్ధుడి మృతి

Published Wed, Apr 17 2024 1:45 AM

మేళా నిర్వాహకులతో ఎంపికై న అభ్యర్థులు
 - Sakshi

నెన్నెల: మండలంలోని మైలారం గ్రా మానికి చెందిన కంపెల లింగయ్య(64) సోమవారం రాత్రి తన ఇంటి మెట్లపై నుంచి జారిపడి మృతిచెందాడు. ఎస్సై కే.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్య అధికంగా మద్యం తాగి ఇంట్లోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా కాలు జారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబు లెన్స్‌లో ఎక్కించేందుకు ప్రయత్నించగా అ ప్పటికే చనిపోయినట్లు సిబ్బంది నిర్దారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చేపల వేటకు వెళ్లి శవమయ్యాడు

ఆసిఫాబాద్‌రూరల్‌: చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. వివరాలు.. జిల్లా కేంద్రంలోని బెస్తవాడకు చెందిన నాగోషే శంకర్‌ (26) రోజులాగే ఇంటి పక్కనున్న ధస్‌రాథ్‌తో కలిసి మంగళవారం ఉదయం 9గంటలకు చేపల వేటకు వెళ్లాడు. గుడిగూడ సమీప వాగులో ఇద్దరూ చేపలు పట్టారు. వాగులో నీటిసొరంగం గమనించని శంకర్‌ చేపలు పడుతూ ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యాడు. ధస్‌రాథ్‌ ఎంత గాలించినా శంకర్‌ ఆచూకీ దొరకలేద. దీంతో ఇంటికి ఫోన్‌ చేసి కుటుంబీలకు సమాచారం ఇచ్చాడు. పలువురు శంకర్‌ గల్లంతైన ప్రదేశంలో గాలించారు. సొరంగంలో మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడికి భార్య సురేఖ, కూతురు ఉన్నారు.

ఉద్యోగమేళాకు స్పందన

మంచిర్యాలఅర్బన్‌: మిమ్స్‌ డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. జియో, ముత్తూట్‌ ఫైనాన్స్‌, టీవీఎస్‌ కంపెనీలు జాబ్‌మేళా నిర్వహించాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి డిగ్రీ పూర్తిచేసుకున్న 250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉద్యోగాలకు 96 మంది ఎంపికయ్యారు. టాస్క్‌ రీజినల్‌ మేనేజర్‌ దీపాభారాజు, కళాశాల కరస్పాండెంట్‌ శ్రీనివాసరాజు, ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌రాజు, ప్లేస్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌ శ్వేత, టాస్క్‌ కో ఆర్డినేటర్‌ రోహిత్‌కుమార్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

దండేపల్లి: మండలంలోని లింగాపూర్‌ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌పై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం కలెక్టర్‌ సంతోష్‌కు ఫిర్యాదు చేశారు. యూనిఫాం కుట్టుకూలీకి సంబంధించిన డబ్బులు ప్రిన్సిపాల్‌ విద్యార్థులకు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ప్రిన్సిపాల్‌తో మాట్లాడదామంటే ఆమె పాఠశాలకు సరిగా రాకుండా లీవ్‌లో ఉంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ అనీలాను ఫోన్‌లో సంప్రదించగా, కూలీ చార్జీ డబ్బులు 2022–23 సంవత్సరానికి సంబంధించినవి తెలిపారు. ప్రస్తుతం ఎస్సెమ్సీ కమిటీ రద్దయిందని, కొత్త కమిటీ వేసిన తర్వాత వారితో మాట్లాడి బిల్లులు పిల్లలకు ఇవ్వడమా, పాఠశాల కోసం ఖర్చు చేయడమా అనేది నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు.

లింగయ్య మృతదేహం
1/2

లింగయ్య మృతదేహం

శంకర్‌ (ఫైల్‌)
2/2

శంకర్‌ (ఫైల్‌)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement