
ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
● ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమన్
కైలాస్‌నగర్: ఆర్టీసీ ప్రయాణికులు గమ్యం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే బస్సుల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని సంస్థ రీజినల్ మేనేజర్ సోలోమన్ అన్నారు. ఆదిలాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికులకు ఈ యాప్ వినియోగంపై శుక్రవారం అవగాహన కల్పించారు. పలువురి ప్రయాణికుల మొబైల్ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేసి ఎలా వినియోగించాలో సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రవేశపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటుందని అన్నారు. అందులో భాగమే ఈ గమ్యం యాప్ అన్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని తెలిపారు. కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్లు ప్రణీత్, ప్రవీణ్‌కుమార్, డిపో మేనేజర్ కల్పన తదితరులు పాల్గొన్నారు.