‘గుర్తింపు’ పోరు జరిగేనా? | - | Sakshi
Sakshi News home page

‘గుర్తింపు’ పోరు జరిగేనా?

Sep 22 2023 1:58 AM | Updated on Sep 22 2023 1:58 AM

 గని కార్మికులు - Sakshi

గని కార్మికులు

● సింగరేణి కార్మికులకు తప్పని ఎదురుచూపులు ● కోర్టులో కేసు విచారణ, సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ ● నేడు మరోమారు ఎన్నికల నిర్వహణపై సమావేశం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అన్ని సజావుగా సాగితే శుక్రవారమే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడాల్సి ఉంది. కానీ.. గుర్తింపు సంఘం ఎన్నిక కాల పరిమితి ఎన్నికలకు ముందే నాలుగేళ్లుగా ఉండాలని హైకోర్టులో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) కేసు వేయడంతో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయనే దానిపై ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది. గతంలోనే కాల పరిమితిపై కార్మిక శాఖ పరిధిలో ఉంటుందని కోర్టులు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా కేసుపై ఎలా స్పందిస్తుందోనని కార్మిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల కోసం కార్మిక సంఘాలు రెండేళ్లుగా పట్టుబడుతున్నాయి. ఇందుకోసం పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ నెల 22న మరోమారు కార్మిక సంఘాలు, కార్మిక శాఖ కమిషనర్‌, యాజమాన్యం చర్చించి షెడ్యూల్‌ వెలువరించాలి. కానీ కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడనుంది.

సర్కారు సహకారమే ప్రధానం

గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారమే ప్రధానం కానుంది. పోలీసు, రెవెన్యూ, స్థానిక కలెక్టర్ల పర్యవేక్షణలో ఎన్నికలు జరగాల్సి ఉంది. సంస్థ విస్తరించిన కుమురంభీం, మంచి ర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో స్థానిక పోలీసు, అధికార యంత్రాంగం సహకారం తప్పనిసరి. సింగరేణి ఉద్యోగులతో పాటు మరో 350 వరకు టీచర్లను ఎన్నికల విధుల కోసం కేటాయించాల్సి వస్తుంది. వీరిని ఎన్నికల కోసం డిప్యూటేషన్‌ ప్రాతిపదికన నియమించాలి. ఇందుకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఉత్తర్వులు అవసరం. ఈ మేరకు గతంలోనే ఆయా కలెక్టర్లకు సిబ్బ ందిని సమకూర్చాలని లేబర్‌ కమిషన్‌ నుంచి లేఖ లు రాసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం ఉంటేనే ఆయా జిల్లాల ఉన్నతాధికారులు ముందు కు వెళ్లే అవకాశం ఉంది. ఓ వైపు అక్టోబర్‌ రెండో వా రంలోపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ వెలు వడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోపే గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగితే ఇబ్బంది ఉండదు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో నేడు జరిగే సమావేశం కీలకంగా మారనుంది.

ఈ సమావేశంతోనైనా తేలేనా?

గతేడాది అక్టోబర్‌ నుంచి హైకోర్టులో కేసులు, విచారణలు, ఎన్నికల నిర్వహణ కోసం సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించాలని ఏఐటీయూసీ వేసిన పిటిషన్‌ మేరకు మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. చివరగా ఈ నెల 11న హైదరాబాద్‌లో ఆర్‌ఎల్సీ, యాజమాన్యం, 15కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ నెల 22న షెడ్యూల్‌ విడుదల చేయాలని ప్రాథమికంగా అంగీకారం కుదిరింది. ఇందులో ఏఐటీయూసీ, బీఎంఎస్‌ అదే రోజు షెడ్యూల్‌ విడుదల చేయాలని పట్టుబట్టినా, మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే అక్టోబర్‌ 27న పోలింగ్‌ జరగాలి. కానీ హైకోర్టులో కాలపరిమితిపై కేసు విచారణ రావడం, కలెక్టర్లు సైతం సిబ్బంది నియామకానికి ఆసక్తిగా లేకపోవడం వంటి పరిణామాలతో మళ్లీ వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు వాపోతున్నారు. మె జార్టీ కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే గుర్తింపు సంఘ ఎన్నికలు ఉంటాయా? లేక వాయిదా పడుతాయా? అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement