1985లో శ్రీమిత్య కళా నాట్య మండలి ఏర్పాటు... | - | Sakshi
Sakshi News home page

1985లో శ్రీమిత్య కళా నాట్య మండలి ఏర్పాటు...

Oct 25 2026 1:35 AM | Updated on Oct 25 2026 1:35 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2010 నంద్యాలలో, 2012 విజయనగరంలో రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్‌, రంగస్థల కళల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నంది నాటకోత్సవాలకు తుది న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. అప్పటి సీఎంలతో ప్రశంసాపత్రాలు, సన్మానం అందుకున్నాను. తొలి రంగస్థల కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మహబూబ్‌నగర్‌లో 1985లో ‘శ్రీమిత్ర కళానాట్య మండలి ఏర్పాటు చేశాను. మండలికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాను. సంస్థ ఆధ్వర్యంలో కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, నిరుపేద వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం అందజేశాను. ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది ఔత్సాహిక కళాకారులకు ప్రత్యేక శిక్షణ అందజేసి వారు నాటక రంగంలో రాణించేలా తనవంతు కృషి చేశాను. గతంలో భూకంప, వరద బాధితుల సహాయార్థం పలు సార్లు నాటక ప్రదర్శనలు నిర్వహించి ఆర్థికసాయం అందించడం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement