పిచ్చికుక్కల స్వైరవిహారం | - | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కల స్వైరవిహారం

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

బల్మూర్‌: పిచ్చికుక్కల బీభత్సంతో పలువురు గాయపడిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బల్మూర్‌ మండలంలోని లక్ష్మీపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి పిచ్చికుక్క బీభత్సం సృష్టించి గ్రామంలో ఆరుబయట తిరుగుతున్న పదిమందిపై దాడి చేసి విచక్షణారహితంగా కాటు వేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా పశువులను సైతం కరిచింది. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన చుక్క తిరుపతయ్య, సంపంగి నారమ్మ, రొయ్యల వెంకటయ్యలను నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించగా, కుర్మయ్య, బాలమ్మ, రామచంద్రి, పెంటయ్యతోపాటు మరో నలుగురిని 108 అంబులెన్స్‌లో అచ్చంపేట అస్పత్రికి తరలించారు. గ్రామంలో ఒక్కసారిగా పిచ్చికుక్క దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పాటు కుక్కకాటుకు గురైన పశువులకు కూడా అధికారులు చికిత్స నిర్వహించాలని బాధిత రైతులు కోరుతున్నారు. అధికారులు గ్రామంలో కుక్కల బెడదను అరికట్టి, ప్రజలకు రక్షణ కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో ఈ ఘటన జరిగినా సర్పంచ్‌, కార్యదర్శి కనీసం పట్టించుకోకపోవండపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హనుమాన్‌ తండాలో..

తిమ్మాజీపేట: మండలంలోని హనుమాన్‌ తండాలో శనివారం సాయంత్రం కుక్క స్వైరవిహారం చేసి పదిమందిని తీవ్రంగా గాయపరిచింది. తండాలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారులను కూలీ పనులకు వెళ్లి అటుగా వస్తున్న పలువురిని కుక్క కరిచి గాయపరిచింది. గంట వ్యవధిలోని ఒకరి తర్వాత ఒకరిని కరుస్తుండడంతో భయంతో ఎవరు కూడా కుక్కను కొట్టేందుకు ముందుకు రాలేదు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన తిమ్మాజిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇంజక్షన్‌ ఇచ్చాక మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. గాయపడిన వారి వివరాలు.. అఖిల, మంజుల, అజయ, రమేష్‌, నిఖిత, రాజ, గీతను పిచ్చికుక్క కరిచి గాయపరిచింది.

పలువురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement