యువకుడి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

మదనాపురం: ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన వ్యక్తి శవమై కనిపించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దంతనూరుకు చెందిన కావలి పురుషోత్తం(30) ఈనెల 22న ఉదయం 11గంటల సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్తానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతని ఫోన్‌ పనిచేయక పోవడం, కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా.. లిఫ్ట్‌ చేయకపో వడంతో వారు ఆందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం 7గంటల సమయంలో ఆయన తమ్ముడు కావలి నవీన్‌ పొలాల వైపు వెళ్తుండగా.. కాల్వగట్టు పక్కన తవిసి చెట్టుకు పురుషోత్తం ఉరివేసుకుని మృతిచెంది ఉన్నట్లు సమాచారం అందించారు. ఆనవాళ్లను బట్టి, ఇది ఆత్మహత్యనా లేక ఎవరైనా హత్య చేసి ఉరివేశారా అనే కోణంలో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్‌ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కుటుంబ కలహాలతోభర్త బలవన్మరణం

లింగాల: కుటుంబకలహాలతో లింగాల మండలకేంద్రానికి చెందిన చెంచురాయ చిన్న ఉస్సేన్‌ (39) పురుగుమందు తాగి.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గత రెండు నెలలుగా భార్య లింగమ్మ భర్తకు దూరంగా ఉంటోంది. దీంతో మనస్తాపానికి గురైన చిన్న ఉస్సేన్‌ శుక్రవారం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు అతడిని నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అన్న పెద్ద ఉస్సేన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేష్‌ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

కందనూలు: నాగర్‌కర్నూల్‌ మండలం గన్యాగుల గ్రామంలో శనివారం ఓ యువకుడు మృతి చెందాడు. బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామానికి చెందిన పొలమూరి వెంకటేశ్‌ (22) కొన్నేళ్లుగా తన అమ్మమ్మ గ్రామమైన గన్యాగులలో మేనమామ వద్ద ఉంటున్నాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉరివేసుకొని ఆత్మహత్య..

వెల్దండ: మండలకేంద్రానికి చెందిన ఉమ్మమోని దాస్‌ (45) శుక్రవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందాడు. కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్న దాస్‌.. వెల్దండలో వెంకటమ్మతో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి వెంకటమ్మ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

చెరువులో పడి కూలీ మృతి

జడ్చర్ల: ప్రమాదవశాత్తు చెరువులో పడి కూలీ మృతి చెందినట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బాదేపల్లి పాతబజార్‌కు చెందిన చేగోల రాములు (50) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 21న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. శుక్రవారం కావేరమ్మపేట శివారులోని మినీ ట్యాంక్‌బండ్‌ చెరువులో రాములు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

మంటల్లో వాహనం దగ్ధం

మహబూబ్‌నగర్‌ క్రైం: ఇంటి ఎదుట ఖాళీ స్థలంలో పార్క్‌ చేసిన ఓ వాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్‌ ఆఫీసర్‌ మల్లికార్జున్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నగరంలోని మధురానగర్‌కు చెందిన సంతోష్‌ సెకండ్‌హ్యాండ్‌ కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేసి మరమ్మతులు చేయించి తిరిగి విక్రయిస్తుంటాడు. ఇటీవల టీఎస్‌ 06 యూసీ 5713 నంబరు గల టాటా ఏస్‌ వాహనాన్ని కొనుగోలు చేసి, మరమ్మతుల అనంతరం ఇంటి ఎదుట ఖాళీ స్థలంలో పార్క్‌ చేశాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు సమీపంలోని చెత్తకు నిప్పంటించడంతో మంటలు ఎండుగడ్డికి వ్యాపించి, అక్కడి నుంచి వాహనానికి అంటుకున్నాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement