బస్సు, బైక్‌ ఢీ.. యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

బస్సు, బైక్‌ ఢీ.. యువకుడి దుర్మరణం

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

ఊట్కూర్‌: ఊట్కూర్‌ గ్రామంలోని ఊర లక్ష్మమ్మ దేవాలయం సమీపంలో బస్సు–దిచక్రవాహనం ఢీకొని కుర్వ బాల్‌రాజ్‌ (18) అనే యువకుడు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఊట్కూర్‌ నుంచి నారాయణపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఊరలక్ష్మమ్మ ఆలయం సమీపంలోకి రాగానే బైక్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనుక కూర్చొన్న కుర్వ బాల్‌రాజ్‌ ఎగిరి బస్సు టైర్‌ కింద పడడంతో అక్కడికక్కడె మృతి చెందగా బైక్‌ నడుపుతున్న రమేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అలాగే వెనుక వస్తున్న మరో ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడంతో గరిడి ప్రతాప్‌ రెడ్డి, శంకర్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐ రమేశ్‌ను వివరణ కోరగా ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని, ప్రమాదం గురించి తెలియగానే మతదేహాన్ని పోస్టుమార్టం కోసం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్నారు.

ఏడాది క్రితం ఒకరు మృతి..

ఊర లక్ష్మమ్మ దేవాలయం సమీపంలో ఏడాది క్రితం బస్సు–ద్విచక్రవాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే స్థలంలో ఇప్పుడు మళ్లీ ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందడం శోచనీయం.

ముగ్గురికి తీవ్రగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement