అచ్చంపేట రూరల్: వ్యవసాయ పొలంలోని బోరు మోటార్ విషయంలో తమ్ముడిని హత్య చేసిన అన్నను శనివారం సిద్దాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం వ్యవసాయ పొలం వద్ద బోరుమోటార్ ఆన్ చేసిన విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం విషాదాంతమైన ఘటన తెలిసిందే. శనివారం అచ్చంపేట సీఐ కార్యాలయంలో సీఐ ఏశమళ్ల నాగరాజు వివరాలను వెల్లడించారు. మండలంలోని బక్కలింగాయపల్లిలో వ్యవసాయ పొలం వద్ద కేతావత్ బావుసింగ్ ఆయన సోదరుడు కేతావత్ మోహన్ మధ్య బోరు మోటార్ ఆన్‌చేసే విషయంలో గొడవ జరిగింది. అన్న బావుసింగ్ కర్రతో తమ్ముడు మోహన్ తలపై బాదాడు. తీవ్రంగా గాయపడ్డ మోహన్ మృతి చెందాడు. మోహన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేశామన్నారు. శనివారం బావుసింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో సిద్దాపూర్ ఎస్‌ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.


