మహబూబ్‌నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉమరియాలో ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే అండర్–14 హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టుకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. టి.తివిక్రమ్, గౌతమ్ దీక్షిత్, భవ్యరాజ్ జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. శనివారం జిల్లాకేంద్రంలో క్రీడాకారులను ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్, మహబూబ్‌నగర్ హైస్కూల్ హెచ్ఎం శాంత, ఎండీ జియావుద్దీన్ తదితరులు అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి రాష్ట్రానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అనిల్‌కుమార్, బాల్‌రాజు, అహ్మద్ హుస్సేన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


